AP: పులివెందుల నియోజకవర్గంలోని గురువారం ఆర్.తుమ్మలపల్లిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో టీడీపీ వర్గీయుల రాళ్లు, సీసాల దాడి కారణంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్త కృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు, ఎర్రిపల్లి ప్రాంతంలో పోలీసులు ఓటర్లను అడ్డుకుంటున్నారనే ఆరోపణలతో అక్కడ కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఈ వరుస సంఘటనలతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.