AP: రాష్ట్ర వ్యాప్తంగా సూర్యుడు ప్రతాపం చూపుతున్నారు. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరింది. తాజాగా అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇతర జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ప్రజలు ఉదయం 9 గంటల నుంచే బయటకు రావడానికి భయపడుతున్నారు. వేడి గాలుల కారణంగా రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.