AP: భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. వర్షాల తీవ్రత, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల భద్రత కోసం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుందని తెలిపారు.