ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. విశాఖ జిల్లాలో స్కూళ్లు, అంగన్వాడీలకు సెలవు ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అల్లూరి జిల్లా పాడేరులో ప్రైమరీ స్కూళ్లకు సెలవు ఇచ్చారు. కాకినాడ జిల్లాలో స్కూళ్లకు సెలవులు రద్దు చేశారు. మిగిలిన జిల్లాల్లో యథాతథంగా స్కూళ్లు, కాలేజీలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్