ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో తాజాగా మరో 3 జిల్లాల్లోని స్కూళ్లకు, కాలేజీలకు అధికారులు సోమవారం సెలవు ప్రకటించారు. కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని అన్ని స్కూళ్లకు, కాలేజీలకు రేపు సెలవు ఇస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పలు జిల్లాలకు సెలవుల ఇచ్చిన విషయం తెలిసిందే.