AP: అనకాపల్లి జిల్లా, నక్కపల్లిలోని పోలింగ్ కేంద్రంలో గురువారం హోంమంత్రి అనిత తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. సామాన్య పౌరురాలిగా క్యూ లైన్లో నిలబడి ఆమె ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో కీలకమని, ప్రజలందరూ బాధ్యతగా ఓటు వేయాలని కోరారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం పెరగాలని ఆమె విజ్ఞప్తి చేశారు.