తప్పుడు ప్రచారాలపై హోంమంత్రి అనిత వార్నింగ్

AP: డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ కేవలం నోటి మాటలతో తప్పుడు ప్రచారాలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ప్రతి విషయాన్ని ప్రజల ముందు బహిర్గతం చేయడానికి, వారికి అర్థమయ్యేలా సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులలో అత్యధిక శాతం మంది గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నియమితులయ్యారని, గతంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించి తాము గౌరవప్రదంగా నియామక పత్రాలను అందించామని ఆమె స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్