మహిళలపై దాడులు జరుగుతున్నా హోంమంత్రి స్పందించరు: నాగమల్లీశ్వరి

AP: టీడీపీ నేతలు రౌడీల్లా కార్ల మీద, మనుషుల మీద దాడులు చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో లాకప్ డెత్‌లు, మహిళలపై దాడులు జరుగుతున్నా హోంమంత్రి అనిత స్పందించరని మండిపడ్డారు. కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. 70 వేల సీసీ కెమెరాలు, ఈగల్ టీమ్ ఏమయ్యాయో హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్