AP: కాకినాడ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. రంగరాయ మెడికల్ కాలేజీ విద్యార్థులపై జరిగిన లైంగిక వేధింపులను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.