త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనం: మంత్రి సవిత

AP: భక్త కనకదాస జయంతి ర్యాలీలో పాల్గొన్న మంత్రి సవిత, త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనం అందిస్తామని తెలిపారు. దేవాలయాల నిర్వహణకు నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆదరణ 3.0 అమలులో భాగంగా గొర్రెల యూనిట్ల ఏర్పాటుకు స్వయం ఉపాధి రుణాలు, అలాగే గొర్రెల సంరక్షణకు ఫెన్సింగ్, ఎల్ఈడీ బల్బులు ఇస్తామన్నారు. తిరుపతిలో భక్త కనకదాస పీఠం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని సవిత వెల్లడించారు.

సంబంధిత పోస్ట్