ఏపీలోని పార్వతీపురం జిల్లా జియ్యమ్మవలస మండలం చంద్రశేఖరరాజుపురంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం పైల అప్పలస్వామి అనే వ్యక్తి ఇంటి మట్టి గోడ కూలిపోయింది. అదృష్టవశాత్తు, సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.