ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

AP: విశాఖపట్నం జిల్లాలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుండి విమానంలో వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద తనిఖీలు నిర్వహించగా, సుమారు 4.210 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి లభ్యమైంది. దీని మార్కెట్ విలువ దాదాపు 4 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కస్టమ్స్ అధికారులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕