ఏపీ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు చెందిన భారీ ఆయుధాల డంప్‌ను గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా మావోయిస్టులు దాచిన భారీగా గ్రెనేడ్ లాంచర్లు, డిటోనేటర్లు, ఇతర పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు. ఎటపాక PSలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ చక్రవర్తి ఈ వివరాలను వెల్లడించారు.