ఏపీ రైతులకు భారీ అవకాశం.. రూ.10 లక్షల డ్రోన్ కేవలం రూ.2 లక్షలకే!

AP: వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం రైతులకు భారీ సబ్సిడీపై డ్రోన్లు అందిస్తోంది. ఒక్కో డ్రోన్ ధర రూ.9.8 లక్షలు కాగా, ప్రభుత్వం రూ.7.8 లక్షల సబ్సిడీ ఇవ్వడంతో రైతులు కేవలం రూ.2 లక్షలు మాత్రమే చెల్లించాలి. అందులోనూ 50 శాతం వరకు బ్యాంకు రుణం లభిస్తుంది. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది రైతులు కలిసి ఏర్పాటు చేసిన సంఘాలకు ప్రాధాన్యం ఉంటుంది. కనీసం ఇంటర్‌ చదివి ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వారికి 12 రోజుల శిక్షణ ఇచ్చిన తర్వాత డ్రోన్లు అందజేస్తారు. ఒక్కో డ్రోన్‌తో ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్