AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు భారీ ఊరట లభించింది. జగన్‌పై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జగన్ బెయిల్ రద్దు, వేరే ధర్మాసనానికి కేసు విచారణను బదిలీ చేయాలని రఘురామ గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దాంతో రఘురామ తన పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు.