AP: తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలోని కుమ్మరికుంట కాలనీలో దంపతులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. పెంటబోయిన పెద్ద బంగారయ్య (57), అప్పల నరసమ్మ (53) అనే దంపతులు దుస్తులు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత పడ్డారు. స్థానికుల సమాచారం ప్రకారం, మొదట విద్యుత్‌షాక్‌కు గురైన తన భార్యను రక్షించే ప్రయత్నంలో భర్త కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.