విశాఖలో రెడ్డి కంచరపాలెంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. పెయింటర్‌గా పనిచేసే గోపీనాథ్ తన భార్య వెంకటలక్ష్మీని డంబుల్స్‌తో కొట్టి హత్య చేసి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం అలవాటు, భార్యపై అనుమానంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దంపతుల మధ్య వాగ్వాదం జరిగాక గోపీనాథ్ పిల్లలను ఇంటి బయటకు పంపించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. రుత్విక్(19), లక్ష్మీపద్మ(10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.