హైదరాబాద్‌కు చెందిన మాక్స్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన బి.వి.వి.ఎస్.ఎన్. రాజు ఆదివారం (ఏప్రిల్ 26, 2026) టీటీడీకి రూ.1.20 కోట్లు విరాళంగా అందించారు. ఇందులో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఒక రోజు అన్న ప్రసాద వితరణకు రూ.44 లక్షలు, శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.76 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.