AP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ 2 స్థానం అనేది లేదని, కేసులు చుట్టుముట్టిన తర్వాతే తనను నంబర్ 2గా ప్రచారం చేశారని విజయసాయి రెడ్డి ఈడీ విచారణలో తెలిపారు. ప్రాంతీయ పార్టీల్లో నంబర్ 2 ఉండదని, లిక్కర్ స్కామ్ గురించి తనకు తెలియదని, అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వారినే అడగాలని సూచించినట్లు ఆయన చెప్పారు. ఈడీ విచారణలో కొన్ని ప్రశ్నలను మాత్రమే రికార్డు చేశారని, మరికొన్ని చేయలేదని ఆయన పేర్కొన్నారు.