డీజిల్, పెట్రోల్ కొరత సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాను: అవినాష్ రెడ్డి

ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు కడప వైయస్ఆర్ సీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ సమస్య ఎందుకు వచ్చిందని కేంద్ర పెట్రోల్, సహజవాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కలిస్తే, ఆయన కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయమే ఈ ఇంధన కొరతకు కారణమని విస్తుపోయే సమాధానం చెప్పారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్