నేను ఎలాంటి స్కామ్ చేయలేదు.. బెయిల్ ఇవ్వండి: మిథున్ రెడ్డి

AP: తాను ఎలాంటి స్కామ్ చేయలేదని, తనకు బెయిల్ మంజూరు చేయాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి న్యాయమూర్తిని కోరారు. శుక్రవారంతో గడువు ముగియడంతో ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మూడు సార్లు ఎంపీగా పని చేశాను. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నాను. నేను దేశం విడిచి పారిపోను. నాకు బెయిల్ మంజూరు చేయండి’ అని న్యాయమూర్తికి ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్