AP: కుటుంబ సభ్యుల రాజకీయ ప్రవేశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వయసు అయిపోతోందని చెప్పారు. తన తర్వాత కుటుంబసభ్యులు కూడా టీడీపీకి సేవ చేసే అవకాశం ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. సోమవారం తిరుమల వెంకన్నను కుటుంబసమేతంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు అయ్యన్నపాత్రుడు పరోక్షంగా సంకేతాలిచ్చారని రాజకీయ నేతలు అంటున్నారు.