ఏపీలో రెడ్ బుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో నడుస్తోందని వైసీపీ ఇప్పటికే తెగ ఆరోపణలు చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. నాకూ ఒక రెడ్ బుక్ ఉంది. అందులో చెడ్డొల్ల పేర్లు ఉన్నాయి. నేనసలే ఊరుకునేదాన్ని కాదని ఎమ్మెల్యే అఖిలప్రియ అన్న వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.