AP: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టును రాష్ట్రంలో అధికార దుర్వినియోగం నిదర్శనంగా వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా జైలులో విరూపాక్షిని కలిసిన అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. తాను జైలుకు వస్తే తనను అవమానించే ప్రయత్నం చేశారని, మాజీ ముఖ్యమంత్రిగా వచ్చిన తనను గ్రిల్స్ బయట నిలబెట్టి ఫోటో తీయడం చంద్రబాబు శాడిస్టిక్ మనస్తత్వానికి నిదర్శనమని జగన్ విమర్శించారు. తమ హయాంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లు తీసుకొస్తే, వీళ్లు అవమానించే సంస్కృతిని తెచ్చారని ఆయన అన్నారు.