ఎంపీగానే రాజకీయాల్లో కొనసాగుతా: ఎంపీ శ్రీభరత్

AP: విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారని సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. దీనిపై ఎంపీ భరత్ స్పందించారు. తాను ఎంపీగానే కొనసాగుతానని అన్నారు. విశాఖపట్నం లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించడానికి ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాఖ ఉత్తరం, భీమిలి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారంలో నిజం లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్