AP: రాజకీయ నాయకులకు సీఎం చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. అసభ్యంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కడప జిల్లాలో పర్యటించిన ఆయన ప్రజావేదికలో మాట్లాడుతూ… ఎవరైనా తోక జాడిస్తే.. క్షణం కూడా ఆలోచించకుండా తోక కత్తిరిస్తానని మండిపడ్డారు. ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని జగన్ పరామర్శించడం ఏంటి? అంటూ వ్యాఖ్యానించారు.