రైతులు కష్టాల్లో ఉంటే.. గదిలో కూర్చొని జగన్ అబద్దాలు ప్రచారం: అచ్చెన్నాయుడు

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి కె. అచ్చెన్నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు. రైతులు కష్టాల్లో ఉంటే.. గదిలో కూర్చుని జగన్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఒక అబద్దాల కోరని విమర్శించారు. గురువారం ఉమ్మడి కృష్ణాజిల్లా పామర్రు, వెంట్రప్రగడలో మొంథా తుపాన్ అనంతరం పరిస్థితులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పంటల బీమాపై వైసీపీ టెలి కాన్ఫరెన్స్‌లో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. జగన్ వాస్తవాలు మాట్లాడితే సమాధానం చెబుతామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్