AP: ఒకప్పుడు వైసీపీ చేసిన పనులనే టీడీపీ ఇప్పుడు చేస్తోందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్నప్పుడు, డబ్బులు చెల్లించి ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలకు మేలు జరిగితే, ఆ అనుభవాలే మాట్లాడాలని, సుపరిపాలన తన ప్రతినిధులను తానే సృష్టించుకోవాలని, డబ్బులు చెల్లించాల్సిన అవసరం రాకూడదని విజయసాయిరెడ్డి అన్నారు.