AP: కూటమి ప్రభుత్వం తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. తన దగ్గర రూ.1000 కోట్లు ఉన్నట్లు కూటమి ప్రభుత్వం నిరూపిస్తే.. అమరావతి అభివృద్ధికి రూ.950 కోట్లు ఇచ్చేస్తానని పేర్కొన్నారు. అతనికి రూ.50 కోట్లు చాలంటూ వెల్లడించారు. తాను అమ్మిన ప్రాపర్టీల విలువ రూ.వెయ్యి కోట్ల ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదంటూ వ్యాఖ్యానించారు.