AP: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయటకు వస్తే అరాచకాలే జరుగుతాయని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడి కేసులో కుట్ర జరిగిందని, మహిళా ఎస్సైని అవమానించారని ఆయన అన్నారు. జగన్ అబద్ధాలకు ఈసారి గట్టి సమాధానం ఇస్తామని, పొగాకు రైతులపై జగన్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రైతుల కోసం కేంద్రంతో నిరంతరం చర్చిస్తున్నామని, బోరుగడ్డ అనిల్ ఘటన వైసీపీకి గుణపాఠమని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.