AP: క్రాంతి కుమార్‌ను పోలీసులు హింసించారని, అది తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడితే కనీసం పట్టించుకునే స్థితిలో చంద్రబాబు లేరని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ‘క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలం సీపీకి చూపించినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మూడు నెలలు స్టేషన్‌కు పిలిచి టార్చర్ చేశారని క్రాంతికుమార్ వీడియోలో చెప్పారు. సీపీ పరిధిలో ఉన్న స్టేషన్‌లో ఇంత జరుగుతుంటే ఆయనేం చేస్తున్నారు. క్రాంతి కుటుంబం ఫిర్యాదు చేస్తే కేసు పెట్టలేదు. క్రాంతి కుటుంబానికి న్యాయపరంగా సహాయం చేస్తాం’ అని అన్నారు.