ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మన మాతృ భాష అమ్మ అయితే.. మన పెద్దమ్మ భాష హిందీ’ అని పవన్ అన్నారు. శుక్రవారం రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ‘ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్లే ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశంలో ఎక్కువ శాతం జనాభా మాట్లాడే హిందీ భాష నేర్చుకోవడం వల్ల ప్రయోజనమే కానీ నష్టం వచ్చే పరిస్థితి ఏం లేదు. హిందీ నేర్చుకుంటే మన ఉనికి మరింత బలపడుతుంది’ అని అన్నారు.