AP: సీఎం చంద్రబాబు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. బాగా పని చేస్తే దండ వేస్తానని, పనిచేయని వారికి దండన తప్పదని హెచ్చరించారు. మంగళవారం నెల్లూరులో చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో ఖర్చు పెట్టిన డబ్బులు ఆ పార్టీ దొంగల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు కనిపించేలా పనుల కోసం డబ్బులు ఖర్చు చేస్తుందన్నారు. ఈ ఏడాది వరుణుడు కరుణించాడని, విశాఖలో ఒకే రోజు 27 సెంటీ మీటర్ల వర్షం కురిసిందన్నారు..