పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తే.. కక్ష సాధింపా?: దువ్వాడ శ్రీనివాస్

AP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తనపై నమోదైన కేసులపై స్పందిస్తూ ప్రభుత్వ తీరును విమర్శించారు. గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించినందుకే తనపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం తాను అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం కక్షసాధింపు చర్యేనని అన్నారు. చట్టపరంగా తన హక్కులను కాపాడుకునేందుకు న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. రాజకీయ కక్షతోనే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్