AP: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు రెండో రోజు విచారించనున్నారు. కనుపూరు చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారంటూ ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. కోర్టు అనుమతితో నిన్న వెంకటాచలం పోలీసులు కస్టడీలోకి తీసుకుని మొత్తం ఆయనను 30 ప్రశ్నలు అడిగారు. రాజకీయ, వ్యాపార సంస్థల వివరాలు కూడా తెలుసుకున్నారు. రెండో రోజు విచారణ కోసం కాకాణిని జిల్లా జైలు నుంచి పోలీస్ శిక్షణాకేంద్రానికి తరలించారు.