తుపాను ప్రభావం.. రాష్ట్రవ్యాప్తంగా 38 వేల హెక్టార్లలో పంట నష్టం

AP: మొంథా తుపాన్‌ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 38 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, 1.38 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలు కూడా నష్టపోయాయని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. మంగళవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నెల్లూరు జిల్లా ఉలవపాడు 12.6 సెం.మీ., సింగరాయకొండ 10.5 సెం.మీ., కావలి 12.2 సెం.మీ., దగదర్తి 12 సెం.మీ., బి.కోడూరు 6 సెం.మీ., కళింగపట్నం 7 సెం.మీ., విశాఖలో 2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్