ఏపీలో కొత్త ప్రభుత్వం రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ వెబ్ సైట్‌లో మార్పులు చేశారు. రైతులకు ప్రతి ఏటా రూ.20 వేలు సాయం చేస్తామన్న టిడిపి కూటమి ఎన్నికల హామీ సందిగ్ధంలో పడింది. రైతులకు చేస్తామన్న సాయంపై ఇప్పటి వరకు ప్రభుత్వంలో కనీస మాత్రపు చర్చ లేదు. అన్నీ చూసుకొని రానున్న జనవరిలో సంక్రాంతికి కొంచెం అటూ ఇటూగా రైతు సాయం విడుదల చేస్తారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.