AP: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై మాజీ ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జనసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని అంజద్ బాషా పేర్కొన్నారు. సదరు ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.