జిల్లాలు పెంపు.. డివిజన్, మండలాల విభజనకు గెజిట్

AP: కొత్త జిల్లాల పెంపు నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో ప్రభుత్వం కీలక గెజిట్ విడుదల చేసింది. బనగానపల్లెను కొత్త రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తూ, ఆదోని మండలాన్ని రెండు భాగాలుగా—ఆదోని, పెద్దహరివాణం మండలాలుగా—విభజిస్తూ ప్రభుత్వం గెజిట్ నం. 796 ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విషయాన్నీ కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు డాక్టర్ ఏ.సిరి, జి.రాజకుమారిలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్