కృష్ణానదిలో పెరిగిన వరద ఉధృతి

AP: భారీ వర్షాల కారణంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీకి కృష్ణానది వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగులకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వివిధ కాలువలకు 8,000 క్యూసెక్కుల నీటిని మళ్లించగా, గేట్లు ఎత్తి సముద్రంలోకి 47,125 క్యూసెక్కుల మిగులు నీటిని విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕