AP: రాష్ట్రంలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. మార్కాపురం జిల్లా కంభంలో అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. రాబోయే రోజుల్లోనూ ఎండలు దంచికొడతాయని, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లోని 23 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.