అన్నవరం దేవస్థానంలో తనిఖీలు (వీడియో)

అన్నవరం దేవస్థాన ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడుతున్నట్లు ప్రచారం జరిగింది. దాంతో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యప్రభ ఆదివారం అన్నవరం దేవస్థానం ప్రసాద శాల, సెంట్రల్‌ స్టోర్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నెయ్యిని పరిశీలించారు. నెయ్యి శాంపిళ్లు, రిపోర్టులను ఆలయ సిబ్బంది నుంచి తీసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు.

సంబంధిత పోస్ట్