నాగబాబుకూ తప్పని అవమానాలు?

AP: ఉత్తరాంధ్ర జిల్లాల్లో పట్టు కోసం ఎమ్మెల్సీ నాగబాబుని వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయించే ఆలోచనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో నాగబాబు బిజీగా ఉన్నారట. అయితే ప్రోటోకాల్ ఇష్యూస్, అధికార యంత్రాంగం తీరు నాగబాబుకు అసంతృప్తి కలిగిస్తున్నాయట. అధికారిక కార్యక్రమాలకు తనను ఆహ్వానించకపోవడాన్ని నాగబాబు అవమానంగా భావిస్తున్నారట. దీనిపై శాసన మండలి సెక్రటరీ జనరల్ స్పందించి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత పోస్ట్