AP: ఏపీలో జూన్ 20న ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లపై టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడే ఈ సీట్లలో, కూటమి పరం అవడం ఖాయం. మొదట్లో టీడీపీకి రెండు, జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి సీట్లు అన్న ప్రచారం జరిగినా, మారిన పరిణామాలతో టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి అన్న కొత్త చర్చ సాగుతోంది. టీడీపీలో ఆశావహులు ఎక్కువగా ఉండటం, సామాజిక, ప్రాంతీయ సమతూకం పాటించాల్సిన అవసరం దృష్ట్యా, బీజేపీకి సీటు ఇవ్వకుండా టీడీపీ తన వద్దనే ఉంచుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.