AP: రాజ్యసభ సీట్ల కోసం టీడీపీలో తీవ్రమైన పోటీ నెలకొంది. జూన్‌లో రిటైర్ అవుతున్న నలుగురు ఎంపీలలో, టీడీపీ నుంచి సానా సతీష్‌కు మరోసారి అవకాశం దక్కే అవకాశం ఉంది. మిగిలిన మూడు సీట్లలో ఒకటి టీడీపీకి, జనసేన, బీజేపీకి ఒక్కొక్కటి దక్కవచ్చని అంచనా. టీడీపీలో మిగిలిన ఒకే సీటు కోసం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, మాజీ ఎంపీ గళ్ళా జయదేవ్, దేవినేని ఉమా మహేశ్వరరావు, వర్ల రామయ్య, బీసీ కోటాలో మాజీ ఎమ్మెల్యే జంగా క్రిష్ణమూర్తి వంటి పలువురు ఆశిస్తున్నారు.