AP: ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. బుధవారం ఉదయం 10:31 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్ సైట్ ద్వారా, అలాగే వాట్సాప్ (9552300009) ద్వారా కూడా చెక్ చేసుకునే సదుపాయం కల్పించనున్నారు. ఏపీ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు నిర్వహించింది సర్కార్. ఇంటర్ ఫస్టియర్ లో ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణల కారణంగా పరీక్షల నిర్వహణకు దాదాపు నెలరోజుల సమయం పట్టింది. ఈ కారణంగానే మూల్యాంకనం పూర్తి చేసేందుకు అధికారులు కాస్త సమయం తీసుకున్నారు.