పిడుగు పడి ఇంటర్ విద్యార్థిని మృతి

AP: అల్లూరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఫోన్ మాట్లాడుతున్న ఇంటర్ విద్యార్థిని కీర్తి(16) పిడుగుపాటుకు గురై మృతి చెందింది. అనంతగిరి మండలం పెదబిడ్డ పంచాయతీ చెరుకుమడత గ్రామానికి చెందిన కీర్తి, దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. పిడుగుపాటుతో స్పృహతప్పి పడిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది.

సంబంధిత పోస్ట్