ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్డేట్ అందించింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు (IPASE మే 2026) కోసం ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. ఇది ఒకసారి మాత్రమే ఇచ్చిన గడువు అని, దీని తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగింపు ఉండదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు తమ కాలేజీల ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాలి. థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు, ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి 11 వరకు జరుగుతాయి.