వెంకటగిరి మున్సిపాలిటీ వైసీపీలో అంతర్గత పోరు

AP: నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో అధికార వైసీపీలో అంతర్గత పోరు తీవ్రమైంది. ప్రస్తుత మున్సిపల్ చైర్ పర్సన్ నక్కా భానుప్రియపై సొంత పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. గతంలో అవిశ్వాసం ప్రవేశపెట్టిన కౌన్సిలర్లను పార్టీ ఇంచార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి బుజ్జగించి, అవిశ్వాసం వీగిపోయేలా చేశారు. అయితే, ఇప్పుడు చైర్ పర్సన్ నక్కా భానుప్రియ, పార్టీ ఇంచార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిపై ముఖం చాటేస్తున్నారని, ఆయన కౌన్సిలర్లతో తిరుగుబాటు చేయిస్తున్నారని జోరుగా చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్