శ్రీసిటీలో ఫ్యాక్టరీ ప్రమాదంపై విచారణ

AP: తిరుపతిలోని శ్రీసిటీలో జరిగిన ఫ్యాక్టరీ బాయిలర్ పేలుడు ఘటనలో ఐదుగురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. యాజమాన్యం బాయిలర్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసింది. పోలీసులు ప్లాంట్ హెడ్, ఆపరేటర్లను విచారిస్తున్నారు. దర్యాప్తు బృందం కంపెనీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తోంది. శ్రీసిటీలోని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕